Telangana: తెలంగాణలో కొత్తగా 2,083 మందికి కరోనా

Aug 1st  For the first time reports more than 2000 confirmed Corona cases
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. తెలంగాణ  రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం..  మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,083 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 11 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మరో 1,114 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  64,786. ఆసుపత్రుల్లో 17,754 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 43,751 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 530కి చేరింది. జీహెచ్‌ఎంసీలో 578 మందికి కొత్తగా కరోనా సోకింది.

తెలంగాణలో కరోనా వైరస్‌ పూర్తి వివరాలు..  


                                

ఏయే జిల్లాల్లో ఎంత మందికి కరోనా వైరస్‌?       


Go Back to Shorts
Telangana
Corona Virus
COVID-19

More Telugu News