ఆగస్టు 5న రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహించండి: జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ
- ఆగస్టు 5న అయోధ్యలో రామాలయానికి మోదీ భూమి పూజ
- రాష్ట్రంలోని 24 వేల దేవాలయాల్లో పూజలు, హోమాలు నిర్వహించాలంటూ లేఖ
- ఎస్వీబీసీ చానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న ఎంపీ
రామాలయ నిర్మాణానికి చేస్తున్న భూమి పూజ భారతదేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, కాబట్టి రాష్ట్రంలోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని 24 వేల దేవాలయాల్లో పూజలు, హోమాలు, వేద పఠనం నిర్వహించాలని ఆ లేఖలో కోరారు. అంతేకాదు, ప్రధాన మంత్రి చేస్తున్న భూమి పూజ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ చానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడం ప్రజల చిరకాల వాంఛ అని అందులో వివరించారు.