Corona Virus: దేశంలో 16 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక్కరోజులో 55,079 మందికి కరోనా

Indias COVID tally crosses 16 lakh mark
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో  55,079 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో ఇంత భారీగా కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అదే సమయంలో 779 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 16,38,871కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 35,747కి పెరిగింది. 5,45,318  మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 10,57,806 మంది కోలుకున్నారు.

కాగా, నిన్నటి వరకు మొత్తం  1,88,32,970 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజులో 6,42,588  శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News