Corona Virus: దేశంలో ఒక్కరోజులో 47,704 మందికి కరోనా

Singleday spike of 47704 positive cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం... గత 24 గంటల్లో భారత్‌లో 47,704 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 654 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 14,83,157కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 33,425కి పెరిగింది. 4,96,988 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 9,52,744 మంది కోలుకున్నారు.

కాగా, నిన్న, మొన్న వరుసగా ఐదు లక్షల కంటే అధికంగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు  కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొన్న ఒక్కరోజులోనే 5,15,000 శాంపిళ్లను పరీక్షించగా, నిన్న 5,28,000 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News