Corona Virus: దేశంలో 13 లక్షలు దాటిన కరోనా కేసులు

 Over 48000 coronavirus cases in India in 24 hours
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా కేసులు, మృతుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం... గత 24 గంటల్లో భారత్‌లో 48,916 మందికి కొత్తగా కరోనా సోకింది.  అదే సమయంలో 757 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 13,36,861కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 31,358కి పెరిగింది. 4,56,071 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 8,49,431 మంది కోలుకున్నారు.

కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,58,49,068 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 4,20,898 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News