వెనుకడుగేయని కాలం పేరే కేటీఆర్... మేయర్ బొంతు రామ్మోహన్ మ్యూజిక్ వీడియో ఇదిగో!

Bonthu Rammohan makes a special video song for KTR birthday
  • రేపు కేటీఆర్ పుట్టినరోజు
  • మ్యూజిక్ వీడియో రూపొందించిన బొంతు రామ్మోహన్
  • ఆధునిక చేగువేరా, గెలిచేందుకు వచ్చిన మండేలా అంటూ అభివర్ణన
తెలంగాణ మంత్రి కేటీఆర్ రేపు పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ బర్త్ డే స్పెషల్ ఇచ్చారు. 'వెనుకడుగు వేయని కాలం పేరే కేటీఆర్' అంటూ ప్రస్తుతిస్తూ ఓ మ్యూజిక్ వీడియో రూపొందించారు. ఈ పాటను యువ గాయకుడు యాజిన్ నిజర్ ఆలపించారు. సురేందర్ మిట్టపల్లి రాసిన ఈ పాటకు భరత్ అడోనిస్ స్వరాలు సమకూర్చారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాటలో కేటీఆర్ గొప్పదనాన్ని వివరించేందుకు వీలైనంతగా ప్రయత్నించడం చూడొచ్చు. 'ఆధునిక చేగువేరా', 'గెలిచేందుకే వచ్చిన మండేలా' అంటూ ఇందులో కేటీఆర్ ను అభివర్ణించారు.
Go Back to Shorts
KTR
Song
Birthday
Bonthu Rammohan
Music Video

More Telugu News