ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో ఇకపై ఎల్ కేజీ, యూకేజీ... విద్యావ్యవస్థలో సంచలన మార్పులకు సీఎం జగన్ శ్రీకారం
- ఏపీ విద్యావ్యవస్థలో ప్రీప్రైమరీ విద్యకు ప్రాధాన్యం
- ప్రత్యేక సిలబస్ రూపొందించాలన్న సీఎం జగన్
- వచ్చే ఏడాది నుంచి ఎల్ కేజీ, యూకేజీ
ప్రీ ప్రైమరీ విద్యాబోధనకు అనువైన కొత్త సిలబస్ రూపొందించాలని ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్య, జగనన్న గోరుముద్ద అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ కేజీ, యూకేజీ విద్యపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.