కర్నూలు జిల్లా చాపిరేవుల టోల్ ప్లాజా వద్ద రూ.1 కోటి 80 వేల నగదు పట్టివేత
- హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు వెళుతున్న కారు
- నగదుకు పత్రాలు లేని వైనం
- కేసు నమోదు చేసిన పోలీసులు
ఆ విషయం అటుంచితే, అలాంటిదే మరో ఘటన ఏపీలో జరిగింది. కర్నూలు జిల్లా పాణ్యం మండలం చాపిరేవుల టోల్ ప్లాజా వద్ద ఓ వాహనంలో రూ.1 కోటి 80 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు హైదరాబాద్ నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు వెళుతున్నట్టు గుర్తించారు. ఈ డబ్బుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్ చేసిన అనంతరం కేసు నమోదు చేశారు.