దేశంలో ఒక్కరోజులో 34,956 మందికి సోకిన కరోనా
- కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 10,03,832
- మృతుల సంఖ్య మొత్తం 25,602
- 3,42,473 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
- కోలుకున్న 6,35,757 మంది
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 10,03,832కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 25,602కి పెరిగింది. 3,42,473 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 6,35,757 మంది కోలుకున్నారు.
కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,30,72,718 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,33,228 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.