ఆలోగా దేశంలో 20 లక్షల కరోనా కేసులు నమోదవుతాయి: రాహుల్ గాంధీ
- దేశంలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది
- కేంద్ర ప్రభుత్వం సమర్థంగా చర్యలు తీసుకోవాలి
- ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లాలి
'దేశంలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. ఇదే వేగంతో కొవిడ్-19 కేసులు వ్యాప్తి చెందడం కొనసాగితే ఆగస్టు 10 నాటికి దేశంలో కరోనా సోకిన వారు 20 లక్షల కంటే ఎక్కువ మంది ఉంటారు. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి' అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.