సచిన్ పైలట్ ను దెబ్బతీసేందుకు వసుంధర రాజే ప్రయత్నిస్తున్నారు: భగ్గుమన్న బీజేపీ మిత్రపక్షం
- గెహ్లాట్ కు, ఆమెకు మధ్య స్పష్టమైన అవగాహన ఉంది
- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె రక్షిస్తున్నారు
- పైలట్‌కు మద్దతు ఇవ్వొద్దంటూ చెబుతున్నారు
గెహ్లాట్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పిలిపించుకుని మరీ మాట్లాడుతున్నారని, ఇందుకు సంబంధించి తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని అన్నారు. పైలట్‌కు మద్దతు ఇవ్వొద్దంటూ శిఖర్, నాగూర్‌లోని జాట్ వర్గ ఎమ్మెల్యేలను ఆమె ఆదేశించారని పేర్కొన్నారు. బేనీవాలా ఆరోపణలపై రాజస్థాన్ బీజేపీ చీఫ్ సతీశ్ పూనియా స్పందించారు. అందరికీ గౌరవనీయమైన నాయకురాలైన వసుంధరపై బేనీవాలా ఆరోపణలు సరికాదని హితవు పలికారు.