అనుష్క గురించి వైరల్ అవుతున్న తాజా వార్త ఏమిటంటే..!

13-07-2020 Mon 16:57
  • సినీ కెరీర్ కు అనుష్క గుడ్ బై చెప్పనుందని ప్రచారం
  • పెళ్లి చేసుకుని, లైఫ్ లో సెటిల్ కాబోతోందని టాక్
  • ఇప్పటికే అనుష్క పెళ్లి గురించి వైరల్ అవుతున్న పలు వార్తలు
The news of Anushka Shetty leaving films is going viral

వయసు పెరుగుతున్నా తరగని అందం అనుష్కది. కొత్త తరం హీరోయిన్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నా... అనుష్క క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ అగ్రనటిగానే కొనసాగుతోంది. దాదాపు అన్ని రకాల పాత్రలను పోషించిన అనుష్క... లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సైతం ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా అనుష్కకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది.

యాక్టింగ్ కెరీర్ కు అనుష్క త్వరలోనే గుడ్ బై చెప్పనుందనేదే ఆ వార్త. ఇప్పటికే అనుష్క పెళ్లి గురించి పలు వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పెళ్లి చేసుకుని గృహిణిగా అనుష్క సెటిల్ కాబోతోందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అనుష్క స్పందించాల్సి ఉంది.