ఆలయ నిర్వహణ బాధ్యత రాజకుటుంబానిదే: అనంత పద్మనాభ స్వామి దేవాలయ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు
- ఆలయ మేనేజ్‌మెంట్ వివాదంపై తీర్పు
- ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి అనుకూలంగా నిర్ణయం
- ఆ ఆలయ నిర్వహణ బాధ్యతను రాజకుటుంబానికే అప్పగింత
- ఆలయ కార్యకలాపాల నిర్వహణ కోసం తాత్కాలిక కమిటీ ఏర్పాటు
కాగా, ఆ ఆలయ సంపదలు, నిర్వహణ బాధ్యతలను ట్రావెన్ కోర్ రాజవంశం నుంచి స్వాధీనం చేసుకోవాలని 2011 జనవరి 31న కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ట్రావెన్ కోర్ రాజవంశీయులు అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టింది. గత ఏడాది ఏప్రిల్‌లో తీర్పును రిజర్వ్ చేసి, ఈ రోజు ఈ తీర్పు వెల్లడించింది. 2011లో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున సంపదలు బయటపడిన విషయం తెలిసిందే. అప్పట్లో దేశ వ్యాప్తంగా ఆ ఆలయం వార్తల్లో నిలిచింది.