మంత్రి ఆళ్ల నానికి కరోనా రోగుల నుంచి ఫిర్యాదుల వెల్లువ
- ఏలూరు కలెక్టరేట్ నుంచి మంత్రి సమీక్ష
- నాణ్యతలేని భోజనం అందిస్తున్నారన్న రోగులు
- బాత్రూంలు శుభ్రం చేయడం లేదని ఫిర్యాదు
- సమస్యలపై తన ఫోన్ నెంబర్ కు కాల్ చేయొచ్చన్న మంత్రి
చికిత్సా కేంద్రాల్లో పారిశుద్ధ్యలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, బాత్రూంలు సరిగా శుభ్రం చేయడంలేదని, దుప్పట్లు ఇవ్వడంలేదని, ముఖ్యంగా భోజనం నాసిరకంగా ఉందంటూ అత్యధికులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఆళ్ల నాని కరోనా చికిత్సా కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. ఏవైనా సమస్యలు వస్తే 1800 233 1077 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయొచ్చని, లేకపోతే తన ఫోన్ నెంబర్ కైనా కాల్ చేసి సమస్యలు నివేదించవచ్చని ఆళ్ల నాని స్పష్టం చేశారు.