ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలు... ఒక్కరోజులో 15 మంది మృత్యువాత

Corona deaths raised in AP
  • ఏపీలో కరోనా విజృంభణ
  • 292కి పెరిగిన మరణాల సంఖ్య
  • కొత్తగా 1608 మందికి పాజిటివ్
  • 981 మంది డిశ్చార్జి
ఏపీలో కరోనా వైరస్ భూతం విలయతాండవం చేస్తోంది. ఒక్కరోజులోనే 15 మంది మరణించారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఒకరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు, విజయనగరం జిల్లాలో ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు. దాంతో కరోనా మరణాల సంఖ్య 292కి పెరిగింది.

ఇక గడచిన 24 గంటల్లో 1608 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 208 కొత్త కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 191, తూర్పు గోదావరి జిల్లాలో 169, కర్నూలు జిల్లాలో 144, పశ్చిమ గోదావరి జిల్లాలో 144, గుంటూరు జిల్లాలో 136, ప్రకాశం జిల్లాలో 110 కేసులు గుర్తించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25,422కి పెరిగింది.

తాజాగా 981 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో 13,194 మంది కరోనా నుంచి కోలుకోగా, 11,936 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Corona Virus
Deaths
Positive Cases
Andhra Pradesh
COVID-19

More Telugu News