కొల్లు రవీంద్ర భార్య, కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ నేతలు 

TDP leaders meets Kollu Ravindra wife
  • పరామర్శించిన కేశినేని, కొనకళ్ల, గద్దె అనురాధ
  • స్వార్థ రాజకీయాలతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపాటు
  • టీడీపీపై జగన్ కక్షగట్టారని వ్యాఖ్య
టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర భార్య, కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు పరామర్శించారు. వారిని పరామర్శించిన వారిలో ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, నాగూర్ మీరా, గద్దె అనురాధ తదితరులు ఉన్నారు. రవీంద్ర కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారికి టీడీపీ నేతలు ధైర్యం చెప్పారు.

అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ, కొల్లు రవీంద్ర అత్యంత సౌమ్యుడని... రాజకీయ స్వార్థం కోసం హత్యా నేరంలో ఇరికించారని ప్రభుత్వంపై మండిపడ్డారు. కక్ష సాధింపుల్లో భాగంగా టీడీపీ నేతలపై తప్పుడు కేసులను బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలపై ముఖ్యమంత్రి జగన్ కక్షగట్టారని అన్నారు. ఎన్ని కుట్రలకు పాల్పడినా తాము తగ్గబోమని... ప్రభుత్వ దుశ్చర్యలపై పోరాటం చేస్తామని చెప్పారు. వైసీపీ నేత హత్య కేసులో నిందితుడిగా కొల్లు రవీంద్రపై పోలీసులు అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండులో ఉన్నారు.
Go Back to Shorts
Kollu Ravindra
Kesineni Nani
Telugudesam
Wife

More Telugu News