అమెరికాలో మళ్లీ పేలిన తుపాకి: నైట్ కబ్ల్‌లో కాల్పులు.. ఇద్దరి మృతి
- గ్రీన్‌విల్లేలోని ల్యావిష్ నైట్ క్లబ్‌లో నాలుగు రౌండ్ల కాల్పులు
- తీవ్రంగా గాయపడిన 8 మంది
- ఎవరినీ అదుపులోకి తీసుకోలేదన్న పోలీసులు
గ్రీన్‌విల్లే పోలీసులు, దక్షిణ కరోలినా హైవే పెట్రోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లబ్‌లో మొత్తం నాలుగు రౌండ్ల కాల్పులు వినిపించాయని, పోలీసులు మాత్రం ఎటువంటి కాల్పులు జరపలేదని బోల్ట్ తెలిపారు. కాల్పులు జరిగినప్పుడు క్లబ్ చాలా రద్దీగా ఉందని పేర్కొన్నారు. కాగా, ఇప్పటి వరకు అనుమానితులు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని బోల్ట్ పేర్కొన్నారు.