'ఎలిమెంట్స్' యాప్ ను ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- చైనా యాప్ లపై నిషేధం విధించిన కేంద్రం
- దేశీయ యాప్ లకు ప్రోత్సాహం
- తొలి దేశీయ సోషల్ మీడియా యాప్ గా 'ఎలిమెంట్స్' కు గుర్తింపు
ఈ సోషల్ మీడియా యాప్ ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఇది తొలి దేశీయ సోషల్ మీడియా యాప్ గా గుర్తింపు తెచ్చుకుంది. 'ఎలిమెంట్స్' యాప్ ద్వారా యూజర్లు వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, పర్సనల్, గ్రూప్ చాట్ చేసుకోవడానికి వీలవుతుంది. మున్ముందు కాన్ఫరెన్స్ కాల్స్, డిజిటల్ చెల్లింపులు కూడా ఈ యాప్ లో పొందుపరచనున్నారు. ఈ యాప్ ను ఇప్పటికే లక్ష మంది డౌన్ లోడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ యాప్ రూపకల్పనలో వందల సంఖ్యలో ఐటీ నిపుణులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వలంటీర్లు పాలుపంచుకున్నారు.