కార్గిల్, లడఖ్ ప్రాంతాల్లో భూకంపం!
- తెల్లవారుజామున భూ ప్రకంపనలు
- ఈ ఉదయం అరుణాచల్ లో కూడా
- వెల్లడించిన అధికారులు
కాగా, ఇటీవలి కాలంలో కార్గిల్ ప్రాంతంలో భూమి తరచూ కంపిస్తోంది. గత గురువారం కూడా భూకంపం వచ్చింది. కాగా, తాజా ప్రకంపనలతో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. ఇదిలావుండగా, అరుణాచల్ ప్రదేశ్ లోని పంజీన్ కు ఉత్తరంగా 683 కిలోమీటర్ల దూరంలో మరో భూకంపం 4.4 తీవ్రతతో ఈ ఉదయం నమోదైంది. ఈ భూకంప కేంద్రం భూమి లోపల 252 కిలోమీటర్ల లోతున ఉందని అధికారులు తెలిపారు.