నేడు కూడా లాభాలలోనే ముగిసిన స్టాక్ మార్కెట్
- మార్కెట్ కు వరుసగా మూడో రోజు లాభాలు
- సెన్సెక్స్ 177.72 పాయింట్ల లాభం
- నిఫ్టీ 55.65 పాయింట్ల లాభం
ఐటీ, ఆటోమొబైల్, ఎనర్జీ రంగాల షేర్లలో కొనుగోళ్లు బాగా జరగడంతో సెన్సెక్స్ 177.72 పాయింట్లు లాభపడి 36021.42 వద్ద; నిఫ్టీ 55.65 పాయింట్ల లాభంతో 10607.35 వద్ద ముగిశాయి.
ఇక నేటి ట్రేడింగులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బీహెచ్ఈఎల్, ఐషర్ మోటార్స్, టీవీఎస్ మోటార్, హీరో మోటాకార్ప్, టీసీఎస్, హెచ్సీఎల్, ఇన్ఫోసిస్ తదితర షేర్లు లాభపడగా; ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కెనరా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సిప్లా తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.