Corona Virus: ఏపీలో కొత్తగా 837 మందికి సోకిన కరోనా

coronavirus cases in ap
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 38,898 శాంపిళ్లను పరీక్షించగా మరో 837 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో 789 మంది ఏపీ వాసులు ఉన్నారని వివరించింది. 24 గంటల్లో 258మంది కరోనా నుంచి కోలుకోగా, ఎనిమిది మంది మృతి చెందారు.

రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు 14,414 కాగా, ఏపీలో చికిత్స తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 16,934 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 8,082 మంది ఏపీ వాసులు చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 6,126 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 206కి చేరింది.
                         
Go Back to Shorts
Corona Virus
COVID-19
Andhra Pradesh

More Telugu News