Corona Virus: దేశంలో 5,85,493కి చేరిన కరోనా కేసుల సంఖ్య

507 deaths and 18653 new COVID19 cases in the last 24 hours
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 18,653 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 507 మంది మరణించారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 5,85,493కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 17,400కి పెరిగింది. 2,20,114 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,47,979 మంది కోలుకున్నారు.

కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 86,26,585 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,17,931 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News