RK Singh: చైనా నుంచి వచ్చే విద్యుత్ పరికరాలతో చాలా డేంజర్: కేంద్రం హెచ్చరిక

Union minister RK Singh warns about electric systems made by China
షార్ట్స్‌లో చూడండి
చైనా విద్యుత్ పరికరాలపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చైనా నుంచి దిగుమతి అయ్యే విద్యుత్ పరికరాల వెనుక ఎంతో ప్రమాదం పొంచి ఉందని, వాటిలో చైనా అనేక మాల్వేర్లు, ట్రోజన్ వైరస్ లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు. యుద్ధం అనివార్యమైన పక్షంలో చైనా ఈ విద్యుత్ పరికరాల్లో అమర్చిన మాల్వేర్లు, ట్రోజన్ వైరస్ లను యాక్టివేట్ చేస్తుందని, దాంతో భారత్ లోని విద్యుత్ గ్రిడ్ కుప్పకూలిపోతుందని ఆర్కే సింగ్ వివరించారు.

ఇప్పటి కాలంలో విద్యుత్ రంగం కూడా ఎంతో వ్యూహాత్మక అంశంగా మారిందని, ఒక దేశంలోని కంపెనీలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు అన్నీ విద్యుత్ రంగంపై ఆధారపడి ఉంటాయని అన్నారు. అందుకే దేశంలోని విద్యుత్ రంగాన్ని దెబ్బతీసేందుకు శత్రుదేశం ప్రయత్నిస్తుందని వివరించారు. కానీ, భారత్ తన శత్రుదేశాలకు ఇలాంటి అవకాశం ఇవ్వబోదని, ఇలాంటి విపత్తును ఎదుర్కొనేందుకు ఫైర్ వాల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అందుకోసం పూర్తిగా భారత్ లో తయారైన పరికరాలే ఉపయోగిస్తామని మంత్రి పేర్కొన్నారు.
Go Back to Shorts
RK Singh
Electric Systems
China
Malwares
Grid
India

More Telugu News