తిరుపతిలో 29 నుంచి లాక్‌డౌన్ అంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన నగర పాలక సంస్థ కమిషనర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుపతిలో 29 నుంచి లాక్‌డౌన్ అంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన నగర పాలక సంస్థ కమిషనర్

tirupati city commissioner clarifies about lockdown rumors
  • నగరంలో మరోమారు లాక్‌డౌన్ విధించబోతున్నారంటూ ప్రచారం
  • తీవ్రంగా పరిగణించిన నగర పాలక కమిషనర్
  • ప్రచారం చేస్తున్న వారిని గుర్తించాలంటూ ఎస్పీకి లేఖ
తిరుపతిలో ఈ నెల 29 నుంచి మరోమారు లాక్‌డౌన్ విధించబోతున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న ప్రచారంపై నగరపాలక కమిషనర్ పీఎస్ గిరీశ్ స్పందించారు. ఆ ప్రచారంలో ఎంతమాత్రమూ వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి తప్పుడు ప్రచారంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం తగదని హితవు పలికారు. అంతేకాదు, సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిని గుర్తించాలని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేశ్ రెడ్డికి లేఖ రాశారు. నగరంలో మరోమారు లాక్‌డౌన్ అమలు చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదని, ప్రజలే అప్రమత్తంగా ఉంటూ కరోనాను కట్టడి చేసే చర్యలు పాటించాలని సూచించారు.

Tirupati
Lockdown
Corona Virus

More Telugu News