Corona Virus: దేశంలో ఒక్కరోజులో 16,922 మందికి కరోనా సోకిన వైనం

418 deaths and highest singleday spike of 16922 new COVID19 positive cases reported in India in last 24 hours
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 16,922 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 418 మంది మరణించారు.
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 4,73,105కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 14,894కి పెరిగింది. 1,86,514 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  2,71,697 మంది కోలుకున్నారు.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News