Corona Virus: ఏపీలో మరో 448 మందికి సోకిన కరోనా

coronavirus cases in ap
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌-19 కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 36,047 శాంపిళ్లను పరీక్షించగా మరో 448 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 146 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 8,306 అని పేర్కొంది. ఏపీలో చికిత్స తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 10,331 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 4,465 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 3,712 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 129 కి చేరింది.                          
  
Go Back to Shorts
Corona Virus
COVID-19
Andhra Pradesh

More Telugu News