నితిన్ సినిమాను తిరస్కరించిన ఇలియానా

Ileana rejects an offer from Tollywood
  • నితిన్ హీరోగా 'అంధాదున్' రీమేక్ 
  • నెగటివ్ టచ్ తో కూడిన లేడీ క్యారెక్టర్
  • వెంటనే తిరస్కరించిన ఇల్లీ బ్యూటీ  
టాలీవుడ్ లో మళ్లీ ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీ కావాలనుకుంటున్న గోవా బ్యూటీ ఇలియానా తాజాగా నితిన్ సినిమా నుంచి వెళ్లిన ఆఫర్ ను మాత్రం తిరస్కరించినట్టు చెబుతున్నారు. ఆమధ్య హిందీలో వచ్చిన 'అంధాదున్' చిత్రాన్ని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో నెగటివ్ టచ్ తో కూడిన ఓ కీలక పాత్ర వుంది. హిందీలో ఈ పాత్రలో ప్రముఖ నటి టబు నటించడం జరిగింది.

ఇక తెలుగుకి వచ్చేటప్పటికి ఈ పాత్ర కోసం పలువురుని పరిశీలించారు. టబునే వేయమని కూడా అడిగారట. అయితే, ఆమె నో చెప్పడంతో శిల్పాశెట్టిని అడిగారనీ, అలాగే మరికొందర్ని కూడా అడిగినట్టు వార్తలొచ్చాయి. తాజాగా ఈ పాత్రకు ఇలియానాను సంప్రదించారనీ, ఆమె మాత్రం వెంటనే తిరస్కరించిందనీ సమాచారం. తాను కథానాయిక పాత్రలను మాత్రమే చేయాలని ఆమె కోరుకుంటూవుండడం వల్ల ఇల్లీ బ్యూటీ ఈ ఆఫర్ ను ఒప్పుకోలేదని చెబుతున్నారు.  
Go Back to Shorts
Ileana
Nithin
Tabu
Shilpashetty

More Telugu News