ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, చైనా సైనికాధికారుల కీలక భేటీ
- చైనా వైపున ఉన్న వాస్తవాధీన రేఖ లోపల భేటీ
- చుశూల్ సెక్టార్‌లోని మోల్డోలో గతంలోనూ ఇరు దేశాల భేటీ
- గాల్వన్ లోయ తమదేనంటూ చైనా-భారత్ వాదనలు
ఈ నెల 6వ తేదీన కూడా ఇదే ప్రాంతంలో ఇరు దేశాల ఆర్మీ అధికారులు సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను విస్మరించి ఈ నెల 15వ తేదీన చైనా సైనికులు భారత ఆర్మీపై దాడి చేయడంతో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
దీంతో భారత సైనికులు తిరగబడడంతో చైనా సైనికులు కూడా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. గాల్వన్ లోయ తమదేనంటూ చైనా-భారత్ పరస్పరం వాదనలు చేసుకుంటోన్న నేపథ్యంలో జరుగుతోన్న ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.