Botsa: అమరావతిలో బొత్స పర్యటన... రాజధాని రైతులలో ఆసక్తి!

Botsa inspecting works in Amaravati
షార్ట్స్‌లో చూడండి
ఏపీ రాజధాని అమరావతిలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిలో పర్యటిస్తున్నారు. అమరావతిలో ఆగిపోయిన నిర్మాణ పనులను ఆయన పరిశీలిస్తున్నారు. ఆలిండియా సర్వీస్ క్వార్టర్స్, ఎన్జీవో, హెచ్ఓడీల క్వార్టర్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వెంట సీఆర్డీఏ అధికారులు ఉన్నారు. సీఆర్డీఏ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో కూడా ఆయన సమావేశమయ్యారు. పలు విషయాలపై వారితో చర్చించారు. మరోవైపు, బొత్స పర్యటనపై అమరాతి రైతుల్లో ఆసక్తి నెలకొంది. రాజధానిగా అమరావతినే కొనసాగించే అవకాశం ఉందా? అని చర్చించుకుంటున్నారు.
Go Back to Shorts
Botsa
Amaravati
YSRCP

More Telugu News