అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఒకరి మృతి, 11 మందికి గాయాలు

1 man dead 11 people wounded in Minneapolis shooting
  • మిన్నెయాపోలిస్‌లో అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఘటన
  • చిక్కని నిందితుడు.. ప్రజలెవరూ బయటకు రావొద్దని వినతి
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. మిన్నెయాపోలిస్ నగరంలో గుర్తుతెలియని దుండగుడు పౌరులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా మారిన దృశ్యాలు ఫేస్‌బుక్‌ లైవ్‌లో రికార్డయ్యాయి. అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. నిందితుడు ఇంకా పట్టుబడలేదని, ప్రజలెవరూ బయటకు రావొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
America
Minneapolis
shooting

More Telugu News