గాల్వాన్ ముమ్మాటికీ మాదే... వదిలేది లేదన్న చైనా!
- చైనా పరిధిలోనే గాల్వాన్ లోయ
- ఇండియా సైన్యం కావాలనే రెచ్చగొడుతోంది
- చైనా అధికార ప్రతినిధి లిజియాన్
ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో చైనా పీపుల్స్ ఆర్మీ పెట్రోలింగ్ విధుల్లో ఉందని వ్యాఖ్యానించిన లిజియాన్, భారత సైన్యం, తమను ఏ మాత్రమూ సంప్రదించకుండా, రోడ్లను నిర్మిస్తోందని ఆయన అన్నారు. ఇక్కడ వంతెనలను వారు కట్టారని, ఇతర మౌలిక వసతులను కల్పించుకుంటున్నారని, చాలా సందర్భాల్లో వీటిని అడ్డుకునేందుకు తమ జవాన్లు ప్రయత్నించారని ఆయన అన్నారు. సరిహద్దులను ఇండియా జవాన్లే దాటుతూ, తమను కావాలని రెచ్చగొడుతున్నారని ఆయన మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించారు.