చైనా భారీగా సైన్యాన్ని మోహరించింది: అమెరికా

america on china india violent face off
  • ప్రపంచమంతా కరోనాపై పోరాటం
  • ఇదే సమయాన్ని అదునుగా చూసుకుని చైనా దుశ్చర్యలు
  • మూడేళ్ల క్రితం డోక్లాంలోనూ చైనా‌ ఇలాంటి కుట్రలే
  • చైనా ఆర్మీ వివాదాస్పద ప్రాంతంలో చాలా లోపలికి ప్రవేశించింది
తూర్పు లడఖ్‌లోని గాల్వన్‌లోయ వద్ద భారత్‌-చైనా మధ్య చోటు చేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులను ప్రస్తావిస్తూ చైనాపై అమెరికా విమర్శలు గుప్పించింది. ప్రపంచమంతా కరోనాపై పోరాడుతుంటే ఇదే సమయాన్ని అదునుగా చూసుకుని చైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి డేవిడ్‌ స్టిల్‌వెల్‌ చెప్పారు.

భారత్-చైనా సరిహద్దుల్లో చైనా చర్యలను అమెరికా ప్రభుత్వ పాలకవర్గం నిశితంగా గమనిస్తోందని తెలిపారు. మూడేళ్ల క్రితం డోక్లాంలోనూ చైనా‌ ఇలాంటి కుట్రలే పన్నిందని చెప్పారు. పొరుగుదేశాలతో చైనా ఇటువంటి చర్యలకు పాల్పడుతుండడంపై తమ దేశం ఇప్పుడే తమ వైఖరిని ప్రకటించలేదని తెలిపారు.

చైనా ఆర్మీ వివాదాస్పద ప్రాంతంలో చాలా లోపలికి ప్రవేశించిందని, భారీగా సైన్యాన్ని మోహరించిందని చెప్పారు. చైనా ఇలా ఎందుకు చేసిందన్న విషయంపై స్పష్టత లేదని తెలిపారు. తమ ఆధిపత్యాన్ని చూపించుకోవడంలో భాగంగా లేక వ్యూహాత్మక ఎత్తుగడల్లో భాగంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతుందేమోనని చెప్పారు. భారత్ విషయంతో పాటు కొవిడ్‌-19, దక్షిణ చైనా సముద్రం, హాంకాంగ్‌, వాణిజ్య ఒప్పందాల వంటి అన్ని విషయాల్లోనూ చైనా నిబంధనల ప్రకారం నడుచుకోవట్లేదని చెప్పారు.
Go Back to Shorts
China
america
India

More Telugu News