అఖిలపక్ష సమావేశంపై సీఎం జగన్ తో మాట్లాడిన అమిత్ షా, రాజ్ నాథ్
- రేపు సాయంత్రం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం
- సీఎం జగన్ ను ఆహ్వానించిన కేంద్ర మంత్రులు
- సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎం
అటు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ కూడా సీఎం జగన్ తో మాట్లాడారు. కేంద్రమంత్రుల ఫోన్ అనంతరం రేపు జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరవ్వాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. కాగా, రేపు సాయంత్రం జరిగే ఈ అఖిలపక్ష సమావేశాన్ని కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు.