కొత్త 8కే, 4కే స్మార్ట్ క్యూఎల్ఈడీ టీవీలను విడుదల చేసిన టీసీఎల్.. ధరలు, ఫీచర్ల వివరాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త 8కే, 4కే స్మార్ట్ క్యూఎల్ఈడీ టీవీలను విడుదల చేసిన టీసీఎల్.. ధరలు, ఫీచర్ల వివరాలు!

TCL launches new 8K and 4K QLED TVs in India
  • ఎక్స్915 8కే క్యూఎల్ఈడీ టీవీ ధర రూ. 2,99,990
  • హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ వీటి సొంతం
  • బిల్టిన్ పాప్ అప్ కెమెరా లభ్యం
ప్రముఖ టెలివిజన్ల తయారీ సంస్థ టీసీఎల్ సరికొత్త శ్రేణి టీవీలను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అత్యున్నతమైన ఫీచర్లతో కూడిన 8కే, 4కే క్యూ ఎల్ఈడీ టీవీలను లాంచ్ చేసింది. హ్యాండ్స్ ఫ్రీ, వాయిస్ కంట్రోల్ తో ఇవి మార్కెట్లోకి వచ్చాయి. మార్కెట్లోకి విడుదలైన టీవీల వివరాలు ఇలా ఉన్నాయి.

టీసీఎల్ ఎక్స్915 8కే క్యూఎల్ఈడీ: 

75 ఇంచుల సైజు కలిగిన ఈ టీవీలో బిల్టిన్ పాప్ అప్ కెమెరా ఉంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ క్యూఎల్ఈడీ స్క్రీన్ ప్యానెల్ ను కలిగి ఉంది. ఏఐ 8కే ప్రాసెసర్ సాయంతో నాన్ 8కే కంటెంట్ ను కూడా ఇది 8కే కంటెంట్ గా చూపించగలదు.  దీని ధర రూ. 2,99,990.

4కే క్యూఎల్ఈడీ సిరీస్:

ఈ సిరీస్ లో సీ815, సీ715 వేరియంట్లు ఉన్నాయి. సీ815 సిరీస్ లోని టీవీల ప్రారంభ ధర రూ. 69,990గా ఉంది. వీటిలో సబ్ ఊఫర్ ఉంది. మూడు వేరియంట్లలో ఈ టీవీలు లభిస్తున్నాయి. 55 ఇంచుల టీవీ ధర రూ. 69,990... 65 ఇంచుల ధర రూ. 99,990... 75 ఇంచుల టీవీ ధర రూ. 1,49,990గా ఉంది. ఈ టీవీల్లో 4కే క్యూఎల్ఈడీ డిస్ ప్లే, క్వాంటమ్ డాట్ టెక్నాలజీ, డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మోస్, ఆంక్యో ఇంటెగ్రేటెడ్ సౌండ్ బార్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

సీ715 సిరీస్ లో 50 ఇంచుల టీవీ ధర రూ. 45,990... 55 ఇంచులు రూ. 55,990, 65 ఇంచుల ధర రూ. 79,990గా ఉంది. ఈ టీవీలు 4కే రెజొల్యూషన్ ను కలిగి ఉంటాయి. క్వాంటమ్ డాట్ డిస్ ప్లే, డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మోస్, హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
TCL
New TVs

More Telugu News