India: దేశంలో ఒక్కరోజులో 12,881 మందికి సోకిన కరోనా

India reports the highest single day spike of 12881 new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 12,881 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటి వరకు ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అదే సమయంలో 334 మంది మరణించారు.
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,66,946కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం  12,237కి పెరిగింది. 1,60,384 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,94,325 మంది కోలుకున్నారు.
Go Back to Shorts
India
Corona Virus
COVID-19

More Telugu News