GHMC: జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న కరోనా విజృంభణ

Corona virus spreads rapidly in GHMC area
  • కొత్తగా 214 కేసులు వెల్లడి
  • రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 269 మందికి కరోనా
  • తాజాగా 151 మంది డిశ్చార్జి
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 269 కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 214 మందికి కరోనా నిర్ధారణ అయింది. తాజాగా 151 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 5,675 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,071 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 2,412 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా ఒక మరణం సంభవించగా, కరోనా మృతుల సంఖ్య 192కి పెరిగింది.

More Telugu News

GHMC
Corona Virus
Positive
Deaths
Disharge