భారత జాతీయభావం అనే పులిని చైనా రెచ్చగొట్టింది: అమెరికా మీడియా
- రోజూ చిన్న దేశాలు ఎదుర్కొంటున్న సమస్యనే నేడు భారత్ ఎదుర్కొంటోంది
- ప్రతీకారం విషయంలో మోదీపై ఒత్తిడి తప్పదు
- కథనాలు రాసుకొచ్చిన అమెరికా పత్రికలు
వియత్నాం, మలేషియా, ఫిలిప్పైన్స్ వంటి చిన్నదేశాలు ప్రతి రోజూ ఎదుర్కొంటున్న సమస్యనే ఇప్పుడు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఎదుర్కొంటోందని అమెరికా పత్రికలు పేర్కొన్నాయి. కాగా, వాస్తవాధీన రేఖ వద్ద గాల్వన్ నదీ లోయలో ఈ నెల 15న భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది వరకు భారత సైనికులు, 43 మంది చైనా సైనికులు మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి.