Plane: మద్యం మత్తులో విమానం కిటికీని పగులగొట్టిన అమ్మాయి.. అత్యవసర ల్యాండింగ్‌

Plane Makes Emergency Landing After Drunk Passenger Breaks Window
షార్ట్స్‌లో చూడండి
మద్యం మత్తులో ఉన్న ఓ యువతి తాను ప్రయాణిస్తోన్న విమానం కిటికీని పగులగొట్టిన ఘటన చైనాలో చోటు చేసుకుంది. ఇటీవల ఆమె ఈ ఘటనకు పాల్పడగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.  

చైనాకు చెందిన లీ (29) ఓ అబ్బాయిని ప్రేమించింది. అయితే, అమె ప్రేమను అతడు తిరస్కరించడంతో ఆమె మనసు ముక్కలైంది. ప్రేమ విఫలమైందన్న బాధతో ఆమె కుంగిపోతోంది. ఇటీవల లూంగ్‌ ఎయిర్‌లైన్స్‌లో గ్జినింగ్‌ నుంచి యాచ్చెంగ్‌కు వెళ్తుండగా మద్యం తాగింది.

ప్రియుడిని గుర్తు తెచ్చుకుని ఆ బాధలో విమానం కిటికీని పిడికిలితో కొడుతూ పగులకొట్టే ప్రయత్నం చేసింది. దీంతో విమాన సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. అయితే, అప్పటికే విమానం కిటికీ స్వల్పంగా పగిలిపోవడంతో దాన్ని జెంగ్చూ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దింపారు.
Go Back to Shorts
Plane
China

More Telugu News