చింతమనేని ప్రభాకర్ తో పాటు మరో ఎనిమిది మందికి బెయిల్ మంజూరు

Court grants bail to Chinthamaneni Prabhakar
  • అచ్చెన్న అరెస్ట్ నేపథ్యంలో ఆందోళనకు సిద్ధమైన చింతమనేని
  • లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ కేసు నమోదు
  • 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
టీడీపీ నేత, దెందులూరు  మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టును నిరసిస్తూ కలపర్రు టోల్ గేట్ వద్ద ఆందోళనకు ఆయన సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ చింతమనేనితో పాటు మరో ఎనిమిది మంది అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కోర్టులో ఆయనను పోలీసులు ప్రవేశపెట్టగా... 14 రోజుల రిమాండును కోర్టు విధించింది. ఆయనతో పాటు మరో ఎనిమిది మందిని కూడా రిమాండుకు పంపింది.

ఈ నేపథ్యంలో, బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేయగా... కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చింతమనేనికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి.
Go Back to Shorts
Chinthamaneni Prabhakar
Telugudesam
Bail

More Telugu News