ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో.. స్పీకర్, సీఎం కార్యాలయాలు నిషేధిత ప్రాంతాలు!
- రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
- పాస్ లు ఉన్నవారికే అనుమతి
- నిబంధనలు పాటించాలని అధికారుల వినతి
కాగా, కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే అమలులో ఉన్న లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూనే అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తామని స్పీకర్ తమ్మినేని ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు 20వ తేదీ వరకూ జరిగే అవకాశాలు ఉన్నాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగాన్ని సైతం ప్రత్యక్షంగా కాకుండా, వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో అసెంబ్లీలో ఏర్పాటు చేసిన తెరపై ప్రసారం చేస్తారని సమాచారం. ఆపై బడ్జెట్, దాని తరువాత 19న రాజ్యసభ ఎన్నికల తరువాత అసెంబ్లీ వాయిదా పడనుంది.