Pakistan: పాక్‌లో కలకలం.. ఇద్దరు భారతీయ హైకమిషన్‌ అధికారుల అదృశ్యం

షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్‌లో ఇద్దరు భారత దౌత్యాధికారులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్‌లో పనిచేస్తోన్న ఆ ఇద్దరు అధికారులు ఒకేసారి కనపడకుండాపోయారని తెలుసుకున్న భారత్‌ దీనిపై స్పందించింది. అధికారుల అదృశ్యంపై పాకిస్థాన్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి వారు ఒక్కసారిగా అదృశ్యమైనట్లు తెలిసింది. ఇటీవలే న్యూఢిల్లీలోని పాకిస్థాన్‌ హై కమిషన్‌లో ఇద్దరు పాక్‌ అధికారులు గూఢచర్యానికి పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిని భారత్‌ బహిష్కరించింది. ఈ నేపథ్యంలో పాక్‌లో ఇద్దరు భారత అధికారులు అదృశ్యం కావడం గమనార్హం.
Go Back to Shorts
Pakistan
India

More Telugu News