ఈఎస్ఐ కేంద్ర సంస్థ అయినప్పుడు ఇందులో మంత్రుల బాధ్యత ఏముంటుంది?: అయ్యన్నపాత్రుడు
- రాష్ట్ర సర్కారు ఓ పరిశీలకుడిగానే వ్యవహరిస్తుందని వెల్లడి
- ఈఎస్ఐ లావాదేవీల్లో మంత్రుల ప్రమేయం ఉండదని స్పష్టీకరణ
- ఇది కక్ష సాధింపు చర్యేనన్న అయ్యన్న
దీనికి ఈఎస్ఐ డైరెక్టరే బాధ్యత వహిస్తాడని, తెలంగాణలోనూ ఇలాంటిదే జరిగితే అక్కడ కేవలం ఈఎస్ఐ అధికారులను బాధ్యులుగా చూపారని గుర్తుచేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏపీ సర్కారు విడుదల చేసిన ప్రకటనలో నలుగురు డాక్టర్లను బాధ్యులుగా చూపారే తప్ప, ఆ స్టేట్ మెంటులో అచ్చెన్నాయుడి పేరు లేదని అన్నారు. ఏ విధంగా చూసినా ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగానే కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. కాగా, అచ్చెన్నాయుడి అరెస్ట్ నేపథ్యంలో మరో మాజీ మంత్రికి కూడా ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారని, ఆయనను కూడా అరెస్ట్ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.