Reliance Showroom: విజయవాడ రిలయన్స్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం

  • మొదటి అంతస్తులో మంటలు
  • కాలిపోయిన పాదరక్షలు
  • షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం!
Huge fire accident in Reliance Showroom in Vijayawada

విజయవాడలోని రిలయన్స్ షోరూం అగ్నికీలల్లో చిక్కుకుంది. ఇక్కడి బెంజి సర్కిల్ సమీపంలో ఉన్న రిలయన్స్ షోరూం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అంతస్తులో ఫుట్ వేర్ అమ్మకాలు, వస్త్రాల విక్రయం జరుగుతుంటాయి. ఈ ఫ్లోర్ లోనే కార్పొరేట్ ఆఫీసు కూడా ఉంది. అయితే, అగ్నిప్రమాదం జరగడంతో సగానికి పైగా పాదరక్షలు, బూట్లు మంటల్లో కాలిపోయాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలకు ఉపక్రమించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగివుంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ప్రాథమిక పరిశీలన చేస్తున్నారు.


More Telugu News