Rashmi Gautam: ఈ తాపేశ్వరం 'కాజా' నా ముఖం కన్నా పెద్దగా ఉంది: ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసిన రష్మీ

  • షోరూం ఓపెనింగ్‌కు వెళ్లిన రష్మీ
  • తాపేశ్వరం కాజాను బహుమతిగా ఇచ్చిన నిర్వాహకులు
  • అమేజింగ్ అంటూ రష్మీ హర్షం
rashmi about khaja

'జబర్దస్త్'‌ యాంకర్ రష్మీ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో ఓ వీడియో పోస్ట్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాపేశ్వరం పెద్ద కాజాను పట్టుకుని, అది తన ముఖం కంటే పెద్దగా ఉందని కామెంట్ చేసింది. తూర్పు గోదావరి జిల్లాలోని మండపేటలో ఓ షోరూమ్ ను ప్రారంభించడానికి వెళ్లిన సమయంలో అక్కడి వారు తనకు ఈ కాజాను బహుమతిగా ఇచ్చారని తెలిపింది.

ఈ ఒక్క కాజాను చాలా మంది కలిసి తినేయొచ్చని, తనకు స్వీట్లంటే చాలా ఇష్టమని చెప్పింది. ఇంత పెద్ద కాజాను తనకు ఇచ్చినందుకు ఆ షోరూం యజమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇది చాలా అమేజింగ్‌గా ఉందని చెప్పింది.


                   

More Telugu News