దావూద్ ఇబ్రహీం, అతని భార్యకు కరోనా పాజిటివ్
- కరాచీ మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స
- క్వారంటైన్ లో వ్యక్తిగత సిబ్బంది, గార్డులు
- ఇండియాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్
ముంబైలోని డోంగ్రీలో జన్మించిన దావూద్ ఇబ్రహీం ఇండియాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. 1993 బాంబే బాంబు పేలుళ్ల కేసులో కీలక ముద్దాయి అతను. దావూద్ పై పలు ఇంటర్ పోల్ నోటీసులు ఉన్నాయి. 2003లో దావూద్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా ఇండియా, అమెరికా ప్రకటించాయి. ప్రపంచంలోని టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ నేరగాళ్లలో ఒకరిగా దావూద్ ను అమెరికాకు చెందిన ఎఫ్బీఐ ప్రకటించింది.