Tiger: మంచిర్యాల సమీపంలో.. రహదారిపై పెద్దపులి!

  • ఇప్పటివరకూ బయటకు వచ్చిన చిరుతలు
  • ఘటనా స్థలిని సందర్శించిన అధికారులు
  • సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తం
Tiger Captured in Manchiryala

తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇంతవరకూ చిరుతపులులు జనావాసాల్లోకి రాగా, ఈ దఫా ఏకంగా పెద్దపులే బయటకు వచ్చింది. మంచిర్యాల సమీపంలో రహదారిపైకి ఓ పెద్దపులి వచ్చింది. దీని దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలిని సందర్శించారు. ఇక ఈ వ్యాఘ్రరాజం ఎటువైపు వెళ్లిందన్న విషయమై ఎటువంటి సమాచారమూ లేదని అధికారులు తెలిపారు. దీని కదలికలపై ఆరా తీస్తున్నామని, సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామని తెలిపారు.

More Telugu News