30 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు... ఏపీలో నూతన పారిశ్రామిక విధానం
- ఈ నెల 26న కొత్త పారిశ్రామిక విధానం ఖరారు
- నాలుగు రంగాలకు ప్రాధాన్యం ఇచ్చేలా నయా విధానం
- అవినీతికి చోటివ్వని విధానం అంటూ మంత్రి వివరణ
అవినీతికి చోటివ్వని పారిశ్రామిక విధానానికే తమ ప్రాధాన్యత అని, పర్యావరణానికి హాని చేసే పరిశ్రమలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వబోమని, ఈ మేరకు సీఎం జగన్ కూడా స్పష్టం చేశారని వివరించారు. మంత్రి ఆధ్వర్యంలో ఇవాళ ఇండస్ట్రియల్ టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన పారిశ్రామిక విధానంపై చర్చ జరిగింది.