ఉద్రిక్తతలపై చర్చలు జరిపేందుకు సిద్ధమైన భారత్-చైనా
- ఈ నెల 6న అగ్రశ్రేణి కమాండర్ల భేటీ
- ధ్రువీకరించిన రాజ్‌నాథ్
- చర్చలతో సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు
లడఖ్‌లోని పలు ప్రాంతాల్లోకి చైనా సైన్యం చొచ్చుకురావడంతో భారత్ అందుకు దీటుగా చర్యలు తీసుకుంది. సరిహద్దుల వద్ద మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసుకోవడం, ఎయిర్ బేస్ పనులను చైనా విస్తృతం చేయడంతో భారత్ కూడా అక్కడ ప్రాంతాల్లో రోడ్లు వేస్తూ సైనికులు వెంటనే వెళ్లేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను విస్తరించుకుంటోంది. తాము ఈ పనులను ఆపబోమని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.