విజయవాడలో గ్యాంగ్ వార్... ఓ గ్రూప్ లీడర్ మృతి
- కోట్ల విలువైన భూమి కోసం గొడవ!
- పథకం ప్రకారం దాడులు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడి మృతి
యనమల కుదురులోని ఓ భూ వివాదంలో మణికంఠ, తోట సందీప్ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగగా, రాజీ కుదుర్చుకుందాం అంటూ ఇరు వర్గాలు వచ్చాయి. అయితే, ఓ పథకం ప్రకారం రెండు గ్రూపులు ఆయుధాలతో వచ్చాయి. ఓ మైదానంలో దొమ్మీ జరుగుతోందా అనిపించే స్థాయిలో ఈ గ్యాంగ్ వార్ జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తోట సందీప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.