Sakshi: లాక్ డౌన్ రోజుల్లో ధోనీ ఏంచేశాడో చెప్పిన సాక్షి

Sakshi reveals what Dhoni did in lock down
షార్ట్స్‌లో చూడండి
కరోనా వైరస్ ధాటికి యావత్ ప్రపంచం లాక్ డౌన్ లో కాలం గడుపుతున్న రోజుల్లో టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఇంటికే పరిమితమయ్యాడు. అయితే, ఈ విరామంలో ధోనీ ఏంచేశాడో అతడి అర్ధాంగి సాక్షి వెల్లడించింది. ధోనీ ప్రాతినిధ్యం వహించే ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ తో లైవ్ చాట్ సందర్భంగా సాక్షి మాట్లాడుతూ, లాక్ డౌన్ రోజుల్లో ధోనీ 7 బైకులను విప్పదీసి, మళ్లీ బిగించాడని తెలిపింది. అవి చాలా పాత బైకులని, అయితే వాటికి విడి భాగాలు తెప్పించి, పునరుద్ధరించాడని వివరించింది. వాటిని పూర్తిగా విడదీసి, కొత్త భాగాలను అమర్చాడని తెలిపింది. అయితే ఓ బైకులో ఏ పార్టు మిస్సయిందో కానీ, అది స్టార్ట్ కాలేదని, దాంతో మరుసటి రోజు ఆ బైక్ మొత్తం విప్పదీశాడని వెల్లడించింది.
Go Back to Shorts
Sakshi
MS Dhoni
Bikes
Assembling
Old
Lockdown

More Telugu News